దివ్యాంగులు, బుద్ధిమాంద్యం కలిగినవారికి ఆధార్ లేకున్నా రేషన్ కార్డులను అంద జేయాలని ఆహార సరఫరా శాఖకు రాష్ట్ర ఆహార సరఫరా కమిషన్ సిఫార్సు చేసింది. రేషన్ దుకాణాల్లో ఆహార వస్తువులు తీసుకునేందుకు రేషన్ కార్డు తప్పనిసరి కాగా వీటిని ఆహార సరఫరా శాఖ ముద్రించి సరఫరా చేస్తోంది. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ తప్పని సరిచేయడంతో దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ఆహార కమిషన్ ఆధార్ లేని దివ్యాంగులు, బుద్ధిమాంద్యం కలిగినవారికి రేషన్ కార్డులు అందజేయాలని ఆహార శాఖకు సిఫార్సు చేసింది. ఈ విషయమై ఆహార శాఖ అధికారి మాట్లాడుతూ ఆహార భద్రత చట్టంలో రేషన్ వస్తువులు పేద ప్రజలకు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా రెవిన్యూ అధికారుల సమక్షంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ప్రజలు అందజేసే వినతి పత్రాలు స్వీకరించి పరిష్కారం చూపుతున్నామన్నారు.
WhatsApp us