తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి హుండీలో వచ్చే చిల్లర టిటిడికి పెద్ద సమస్యగా పరిణమించిన తరుణంలో టీటీడీ అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు . టన్నుల టన్నుల చిల్లరను స్టోర్ చేయడం టిటిడికి పెద్ద తలనొప్పిగా మారిన క్రమంలో తీసుకున్న ఆ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది. టీటీడీ చిల్లర సమస్యను పరిష్కరించే ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టిసారించిన టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి ఒక తెలివైన ప్లాన్ వేసి బ్యాంకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు . ఇక ఆ ఆఫర్ కు ఆకర్షితులైన బ్యాంకులు చిల్లర తీసుకోటానికి ముందుకు వస్తున్నాయి.పరకామణిలో పేరుకుపోతున్న చిల్లర కోసం ఫలించిన టీటీడీ యత్నం
పరకామణిలో పేరుకుపోతున్న చిల్లర డిపాజిట్ కోసం ఫలించిన టీటీడీ యత్నం
పేరుకుపోతున్న చిల్లర కుప్ప లతో, టన్నుల, టన్నుల చిల్లర నాణేలతో పరకామణిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న టీటీడీ ఇక ఆ సమస్యకు చెక్ పెట్టడానికి తీసుకున్న నిర్ణయంలో తొలి అడుగు పడింది. టీటీడీ స్పెషల్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం తో పరకామణి నుండి 5.15 కోట్ల చిల్లర నాణేలను తాజాగా బ్యాంకులలో డిపాజిట్ చేశారు టీటీడీ అధికారులు .అయితే ఏయే బ్యాంకులలో డిపాజిట్లు చేశారో మాత్రం ఇంకా వివరాలు వెల్లడించలేదు అధికారులు . గత కొన్నేళ్లుగా టిటిడి కి సంబంధించిన ఆదాయాన్ని పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నా బ్యాంకులు చిల్లర విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. చిల్లర ని తీసుకోవడానికి చాలా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. కానీ తాజాగా టీటీడీ ఇచ్చిన ఆఫర్ రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన హామీ మేరకు బ్యాంకులు ముందుకు వచ్చాయి.
