విజయవాడ : కృష్ణమ్మ జల కళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతోంది. భారీగా వరద నీరు పోటెత్తడంతో కళకళలాడుతోంది. ఆ క్రమంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. భారీగా వరద నీరు చేరుతుండటంతో మంగళవారం ఉదయం నాగార్జున సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తారు. అనంతరం ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. అదలావుంటే నదీ పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేశారు. వరద ఉధృతితో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జల కళ సంతరించుకుంది. ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీల దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. సోమవారం (09.09.2019) నాడు సాయంత్రం నుంచి మొదలైన వరద ప్రవాహం మంగళవారం ఉదయం నాటికి మరింత పెరిగింది. దాంతో ఆరు గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు అధికారులు. అలా 3 లక్షల 39వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌లోకి విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సాగర్ కళకళలాడుతోంది.
WhatsApp us