ఐదు రోజుల భారత పర్యటన కోసం విచ్చేసిన నెదర్లాండ్స్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్, మాక్సియా సోమవారంనాడు రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అదివారంనాడు భారత్‌లో అడుగుపెట్టిన రాజదంపతులకు విమానాశ్రయంలో పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు.
కాగా, సోమవారం ఉదయం రాజదంపతులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. 2013లో నెదర్లాండ్ సింహాసనం అధిరోహించిన తర్వాత విలియమ్ అలెగ్జాండర్ భారతదేశానికి రావడం ఇదే ప్రథమం. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్‌తోనూ విలియమ్ అలెగ్జాండర్ భేటీ కానున్నారు. ఢిల్లీలో జరిగే 25వ టెక్నాలజీ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొంటారు. ఈ సమ్మిట్‌లో నెదర్లాండ్స్ భాగస్వామిగా ఉంది. ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల అనంతరం ముంబై, కేరళలోనూ రాజదంపతులు పర్యటించనున్నారు. భారతదేశంలో ఐదవ అతిపెద్ద పెట్టుబడిదారుగా నెదర్లాండ్స్ ఉంది. విలియమ్ అలగ్జాండర్ పర్యటనతో ఇరుదేశాల మధ్య ఆర్థిక రాజకీయ సహకారం పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.