హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదంపూర్ నియోజకవర్గానికి టిక్‌టాక్ సంచలన తార సోనాలి ఫొగట్ బిజెపి టికెట్‌తో పోటీ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఆమె నియోజకవర్గంలో ఒక ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన సోనాలి ఫొగట్ ప్రజలనుద్దేశించి ‘భారత్ మాతాకీ జై అనమన్నారు. వారి నుండి అనుకున్నంత స్పందన రాకపోవడంతో మీరేమైనా పాకిస్థాన్ నుండి వచ్చారా, హిందుస్థాన్ నుండి వచ్చిన వారే కదా భారత్ నినాదం భారత్ మాతాకీ జై అనడానికేమిటి అంటూ ప్రశ్నించారు. ప్రేక్షకుల్లో కొంత మంది నిశ్శబ్దంగా ఉండిపోయారు. హిసార్ జిల్లాలోని ఆదంపూర్ బాల్‌సామంద్ గ్రామంలో ఈ ర్యాలీ చేపట్టారు. ఆదంపూర్ ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న 40 యేళ్ల ఫొగట్ ‘భారత్ మాతాకీ జై అంటూ మళ్లీ మళ్లీ అన్నారు. ర్యాలీలో ఉన్నవారిలో కొంత మంది నిశ్శబ్దంగా ఉండడంతో భారతీయులై ఉండి భారత్ మాతాకీ జై అనడంలేదు, ఇది చాలా సిగ్గుచేటు అంటూ ఆమె దుయ్యబట్టారు. ఆగ్రహించిన ఆమె భారత్ మాతాకీ జై అనని వారి ఓటుకు విలువలేదన్న ఆమె మాటలు పోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొగట్ చిల్లరరాజకీయాలు చేస్తున్నారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఒక కాలేజీ కట్టిస్తానని ఆమె తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రేక్షకులను ఉత్సాహపరిచేలాగ గట్టిగా భారత్ మాతా కీ జై అనాలని అందరిని హెచ్చరించారు. ఫొగట్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయికి పోటీగా బరిలో దిగారు. అమెథిలో రాహుల్‌గాంధీని స్మృతి ఇరాని ఎదుర్కొన్నట్లుగా తాను కూడా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేను ఎదుర్కోనున్నారు. ఫొగట్ వ్యాఖ్యల గురించి మాట్లాడిన బిజెపి ఆమె ఎవరినీ పాకిస్థానీలు అని అనలేదని పేర్కొన్నారు. ఆమె యువతనుద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని, ఆ తరువాత పార్టీ అమను కలిసి భారత్ మాతాకీ జై అనని వారికి ముఖ్యంగా యువతకు క్షమాపణ చెప్పాలని ఫొగట్‌కు చెప్పినట్లు వారన్నారు.