ప్రధాని నరేంద్ర మోడీ మానసపుత్రికగా భావించే స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వయంగా ఆయనే కోవలం బీచ్‌లో పడి ఉన్న చెత్తను ఏరిపారేశారు. శుక్రవారం జిన్‌పింగ్‌తో భేటీ ముగిసిన అనంతరం కోవలంలోని ఫిషర్‌మెన్స్ కోవ్‌కు చేరుకున్న ఆయన శనివారం ఉదయం కోవలం బీచ్‌లో మార్నింగ్ వాక్ చేశారు. ఆ సమయంలో బీచ్‌లో కనిపించిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర చెత్తను ఎత్తి కవర్‌లోకి వేశారు. ఇలా కోవలం బీచ్‌ను ఆయన శుభ్రపరిచారు.
“మామళ్లపురంలో మంచి మార్నింగ్ వాక్‌తో రోజును ప్రారంభించాను. సుందరమైన తీరంలో వ్యాయామం చేస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. దాదాపు 30 నిమిషాలపాటు వాకింగ్ చేశాను.అంతేకాదు అక్కడ పడిఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను ఇతర చెత్తను తీసి ఓ కవర్‌లో వేసి జయరాజ్ అనే హోటల్ సిబ్బందికి అందజేశారు. బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరంగా ఉంటాము” అని మోడీ ఓ వీడియోను పోస్టు చేశారు.
అంతకుముందు అంటే శుక్రవారం ప్రధాని మోడీ మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఆయనకు మహాబలిపురంలోని ఆలయ విశిష్టతను గురించి వివరించారు. ఇద్దరు నేతలు కాసేపు కలియతిరిగారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ జిన్‌పింగ్ గౌరవార్థం విందును ఏర్పాటు చేశారు. భోజనంలో తమిళ రుచులు చైనా అధ్యక్షుడికి వడ్డించారు. తమిళ సాంప్రదాయ వస్త్రధారణలో మోడీ కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.