బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయలేదని ,దీనిపై టీఆర్ఎస్ నాయకులు విచారణ జరుపుకోవచ్చని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. ఈ సంధర్భంగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం అణగదోక్కుతున్న పరిస్థితి ఎక్కడా లేదని అన్నారు. మొత్తం 48 వేల మంది కార్మికులు చేస్తున్న సమ్మెపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వారిని చర్చలకు పిలకపోవడంతో పాటు వేచి చూసే ధోరణిలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆయన మండిపడ్డారు.
కాగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పాల్గోన్న బీజేపీ నేతలు ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరిన సంధర్భంగా ఆయన హైదారాబాద్ లోని మీడీయాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా కార్మికులు చేపడుతున్న సమ్మెకు పూర్తి మద్దతును ప్రకటిస్తున్నానని చెప్పారు.
ఆర్టీసీ కార్మికుల పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలోనే రాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న ఆందోళనలో పాల్గోంటున్నారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలు సైతం రంగంలోకి దిగారు. ఓవైపు గవర్నర్ సైతం సమ్మెపై దృష్టి సారించిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ జాతీయ నేతలు సైతం రాష్ట్ర అంశంపై మాట్లడంతో టీర్ఎస్ పార్టీపై బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు పలువురు అభితమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
