హైదరాబాద్: మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురిని ఇవాళ ఢిల్లీలోని ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా బ్యాంకుల వద్ద సుమారు 354 కోట్ల రుణం తీసుకున్న కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వారం క్రితమే మోసర్ బేయర్ ఇండియా లిమిటెడ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీకి చెందిన మేనేజింగ్ డైరక్టర్ దీపక్ పురి, డైరక్టర్ నీతాపురి, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రతుల్ పురిలపై కేసును బుక్ చేశారు. అగస్టావెస్ట్‌ల్యాండ్ కేసులోనే రతుల్ పురికి హస్తం ఉన్నట్లు ఈడీ విచారిస్తున్నది. ఇదే కేసులో అతనికి ఢిల్లీ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రతుల్ పురికి చెందిన కంపెనీ 354 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు పత్రాలను చూపి.. మోసర్ బేయర్ కంపెనీ తమ వద్ద రుణం తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొన్నది.
