రాంచీ: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (71) ఆరోగ్యం స్థిరంగా లేదని వైద్యులు తెలిపారు. ఆయన రెండు మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) వైద్యులు శనివారం రాత్రి వెల్లడించారు. షుగర్, బీపీ స్థాయుల్లోనూ తేడాలు ఉన్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే ఆహారం కూడా అంతగా తీసుకోవడం లేదన్నారు.
దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ 2017 నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి సీనియర్ డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ శనివారం వెల్లడించారు.
