జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా నిచ్చిన ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తూర్పారపట్టారు. ఆ పార్టీ ప్రకటనల్ని పాకిస్థాన్ భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకుంటోందని, అసలు ఆ దేశంతో కాంగ్రెస్‌కున్న సంబంధమేమిటని నిలదీశారు. ఆర్టికల్ 370 రద్దును బిజెపి ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోందన్న ఆరోపణకు సమాధానమిస్తూ మోడీ కాంగ్రెస్ వంటి పార్టీలకు ప్రజల సెంటిమెంట్స్‌ను అర్థం చేసుకోవడం కానీ, మన జవాన్ల ప్రాణతాగ్యాన్ని గౌరవించడం కానీ తెలీదని విమర్శించారు. ఈనెల 21న జరిగే ఎన్నికలకోసం ప్రచారం చేస్తూ ఆయన ఒక ర్యాలీలో ప్రసంగించారు.
ఖజాతి ప్రయోజనాలకోసం నేను నిర్ణయాలు తీసుకోవాలా వద్దా? దేశ ప్రయోజనాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలా, వద్దా? హర్యానా ప్రజల అభిప్రాయాల్ని కాంగ్రెస్ అర్థం చేసుకోవడం లేదు. జమ్మూ కశ్మీర్‌లో 70 ఏళ్లుగా రాజ్యాంగం అక్కడ రాజ్యాంగం అమలవుతోంది. కానీ అక్కడ ఎందుకు అభివృద్ధి జరగడం లేదు?
దీన్ని గమనించే ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఆగస్ట్ 5న ఆర్టికల్ 370ను రద్దు చేసినప్పటి నుంచీ కాంగ్రెస్‌కు కడుపు మంటగా ఉంది. ఏ మందూ దాన్ని నయం చేయలేదుగ అని మోడీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసే తప్పుడు ప్రకటనలు, ఫిర్యాదులు, తనను అప్రతిష్టపాలు చేసేవిగా ఉన్నాయని చెబుతూ మోడీ ..అంతర్జాతీయంగా తన వాదనను బలపరుచుకునేందుకు పాకిస్థాన్ కూడా ఇలాగే చేస్తోందన్నారు.