పుల్వామా జిల్లా అవంతిపొర శివార్లలో జరిగిన ఎదురు కాల్పుల్లో హమీద్ లోనె అలియాస్ హమీద్ లెల్హారి, నవీద్ టక్, జునైద్ బట్ అనే ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్లు జమ్మూకాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ అన్నారు. వారిలో హమీద్ లెల్హారీ ఉగ్రవాద కార్యకలాపాలలో ప్రధాన సూత్రధారిగా ఉండేవాడన్నారు. అవంతిపొర శివార్లలో ఉన్న ఒక భవనంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదలు మరణించారున. హమీద్ లెల్హారీ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా జమ్మూకాశ్మీర్ యూనిట్‌కు చీఫ్‌గా వ్యవహరించేవాడని దిల్బాగ్‌సింగ్ తెలిపారు. ఇండియన్ ముజాహిదీన్ కమాండర్ జకీర్ ముసా వారసుడిగా గుర్తింపు పొందాడన్నారు. ఈ యేడాది మేలో జమ్మూకాశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో జకీర్ మూసా హతమయ్యాడు. జకీర్ ముసా మరణానంతరం అల్‌ఖైదాతో పాటు ఇండియన్ ముజాహిదీన్ కార్యకలాపాలను కూడా హమీద్ పర్యవేక్షించేవాడని డిజిపి తెలిపారు. ఈ ఫిబ్రవరిలో సిఆర్పీఎఫ్ కాన్వా§్‌ుపై ఉగ్రవాదలు దాడి చేసిన ఘటన వెనుక హమీద్ హస్తం ఉంటుందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. అతని స్వస్థలం పుల్వామేనని, అదే ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని జమ్మూ కాశ్మీర్ మొత్తం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవాడన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
