మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తుల వద్ద 39 నాటు బాంబులతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అడవి పందుల వేట కోసమే నాటు బాంబులను ఉపయోగిస్తున్నామని ఆ ఇద్దరు చెప్పారు. అయితే ఇతర కార్యకలాపాలకు కూడా బాంబులు ఉపయోగిస్తున్నట్లు పోలీసులకు అనుమానం రావడంతో.. ఆ ఇద్దరిని లోతుగా విచారిస్తున్నారు.