కశ్మీర్ వివాదంపై పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఢిఫెన్స్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తనది కాని కశ్మీర్ కోసం పాకిస్థాన్ ఎందుకు ఘర్షణకు దిగుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ ఎప్పుడు పాకిస్థాన్ పరిధిలో లేదని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఆమోదం కూడ పాకిస్థాన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌తో పాటు బలుచిస్తాన్ ప్రాంతాలను పాకిస్థాన్ ఆక్రమించుకుందని తేల్చి చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో మొదటి సారి ఢిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. ఇందులో భాగంగానే లేహ్ ప్రాంతంలో జరిగిన కిసాన్-జవాన్ విజ్ఝాన్ మేళకు ఆయన ముఖ్య అతిధిగా హజరయ్యారు. అక్కడి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్ ఎప్పుడు పాకిస్థాన్ పరిధిలో లేదని స్పష్టం చేశారు. మరోవైపు కశ్మీర్ తోపాటు బలుచిస్తాన్‌ను పాకిస్తాన్ ఆక్రమించిందని అన్నారు. ప్రస్థుతం ఉన్న పాకిస్థాన్‌ను తాము గౌరవిస్తామని అంతమాత్రనా కశ్మీర్ ప్రాంతాన్ని అక్రమించుకుంటుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఒవైపు పాకిస్థాన్ భారత్‌తో ఉగ్రవాదులను చొప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, ఆ దేశంతో ఎలా చర్చలు జరుపుతామని ఆయన ప్రశ్నించారు… కశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని స్వీకరించమని చెప్పారు. పీవోకే ప్రాంతంలో మానవహక్కులు మంటగలుస్తున్నాయని, అక్కడి ప్రజలపై వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన పాకిస్థాన్ దానిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
