పాకిస్థాన్ నావికాదళం అరేబియా సముద్రంలో విన్యాసాలు సాగిస్తున్న నేపథ్యంలో భారత నావికాదళం అప్రమత్తమైంది. సముద్ర తీరప్రాంతంలో భారత నావికాదళం యుద్ధనౌకలు, సబ్ మెరైన్లు, సముద్ర తీర రక్షణ దళ నౌకలు, పెట్రోలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను మోహరించింది. పాక్ కు గట్టి జవాబు చెప్పేందుకు వీలుగా భారత నావికాదళం సంసిద్ధమైంది.ఈ నెల 25 నుంచి 29వతేదీ వరకు ఉత్తర అరేబియా సముద్రంలో పాకిస్థాన్ మిస్సైళ్లు, రాకెట్లు, గన్ ఫైరింగ్ లతో విన్యాసాలు చేస్తున్నందున వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. పాక్ కు దీటుగా భారత నావికాదళం పోసీడాన్-81 పెట్రోలింగ్ విమానాన్ని రంగంలో దించింది. సముద్రంలో దూరంగా ఉన్న లక్ష్యాన్ని సైతం ఇది ఛేదిస్తోంది. భారత దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం చెన్నై వద్ద సముద్ర జలాల్లోకి తీర రక్షణదళ నౌక వరాహను వదిలారు. పాక్ దీటుగా భారత నావికాదళం, వైమానిక దళాలు సర్వసన్నద్ధమై సముద్ర తీరంలో యుద్ధనౌకలను మోహరించింది.
