ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. సిబిఐ అధికారులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన కుమారుడికి దిగువ న్యాయస్థానం ఇదివరకే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కింది కోట్లు ఇచ్చిన ముంద్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దిగువ న్యాయస్థాయం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేవారు. ముందస్తు బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో ముందస్తు బెయిల్ దొరికిన రోజు ఐఎన్ఎక్్స మీడియా కేసులో చిదంబరాన్ని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు సిబిఐ అధికారులకు స్థానియ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన సిబిఐ అధికారుల కస్టడీలోనే ఉన్నారు. తీహార్ జైలులో సిబిఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఢిల్లీ న్యాయస్థానం ఆయకు ఎండుసార్లు కస్టడీ పొడిగించింది. ఎయిర్ సెల్ మ్యాక్సిస్ కేసులో బెయిల్ రద్దయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణను చిదంబరం, ఆయన కుమారుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్తిచిదంబరం ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఆయనను కూడా తీహార్ జైలుకు తరలించవచ్చని సమాచారం.
