స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ఈ నెల మొదటి నుంచి కొత్త నిబంధనలు తీసుకుని వచ్చిన బ్యాంక్ ఏటీఎమ్ లలో పెట్టే నోట్ల విషయంలో కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకుని రావడంతో భాగంగా ఏటీఎమ్ లలో 2వేల రూపాయల నోట్లు పెట్టకూడదని నిర్ణయించుకుంది.
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) సూచనల మేరకు అన్ని ఏటీఎమ్ ల నుంచి ఎస్‌బీఐ బ్యాంకు 2వేల రూపాయల క్యాసెట్లను కూడా తొలగించింది. అంతేకాదు, భవిష్యత్తులో రూ.200, రూ.100 నోట్లు మాత్రమే ఉంచేలా ప్రణాళికలను RBI సిద్ధం చేసుకుంటుంది.
ఏటీఎమ్ లలో చిన్న చిన్న నోట్లను పెట్టడం ద్వారా వాటి చలామణిని ఎక్కువగా చేయాలని నిర్ణయించుకుని ఈ మరకు నిర్ణయించింది SBI. చిన్న నోట్ల కారణంగా ఏటీఎమ్ లలో ఉంచే నగదు పరిమితి తగ్గే అవకాశం ఉండగా.. ఆ మేరకు లావాదేవీల పరిమితిని కూడా పెంచాలని యోచిస్తుంది SBI. మెట్రో నగరాల్లో 10 సార్లు, ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఏటీఎమ్ నుంచి నగదు తీసుకునే వెసులుబాటును కల్పించేందుకు బ్యాంకు అధికారులు యోచిస్తున్నారు.
SBI ఏటీఎమ్ క్యాష్ విత్‌డ్రా సేవల్లో అనేక మార్పులు తీసుకుని రాగా డెబిట్ కార్డుపై రోజుకు రూ.20,000 నుంచి రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ మేరకు SBI తన కస్టమర్లకు సూచనలు చేసింది. ఒకవేళ ఈ ఉచిత పరిమితిని దాటితే బ్యాంకు కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేస్తుంది బ్యాంకు.
అక్టోబర్ 1వ తేదీ నుంచి బ్యాంక్ సర్వీస్ చార్జీలను సవరించిన SBI అకౌంట్‌లో కావాల్సినంత డబ్బులు లేకుండా ఏటీఎమ్ ట్రాన్సాక్షన్ జరిపితే ఫైన్ చెల్లించాలనే నిబంధన విధించింది.