తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం విధించిన గడవులోపు విధుల్లోకి చేరని ఆర్టీసీ సిబ్బందిని తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్లతో కానీ వాళ్ల యూనియన్ల నాయకులతో కానీ చర్చలు లేవు. కొత్తవారిని తీసుకుంటాము.
విధుల్లో చేరిన పన్నెండు వందల ఉద్యోగులు మాత్రమే ఆర్టీసీలో పనిచేస్తారు అని ప్రకటించడం మిగిలినవారిని తొలగించడమే అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఒక వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా చేస్తే మాత్రం అది చరిత్రవుతుంది.
గతంలో అప్పట్లో 2003లో దివంగత మాజీ సీఎం జయలలిత సమ్మెకు దిగిన మొత్తం 1.7లక్షల మంది ఉపాధ్యాయులను తొలగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. అది అప్పట్లో పెను సంచలనమైంది. ఒకవేళ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు దీని గురించి ఆర్డినెన్స్ తెస్తే పెను సంచలనమవుతుంది.