తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదంలో మునిగిన బోటు ఎట్టకేలకు బయటకు వచ్చింది. గత ముప్పై ఎనిమిది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలితాలను ఇచ్చాయి. ధర్మాడి సత్యం బృందం గత అయిదు రోజులుగా సాంప్రదాయ పద్దతిలో లంగర్లు వేస్తూ తన ప్రయత్నాలు కొనసాగించింది. దీంతో బయటకు వచ్చిన బోటులో పలు మృతదేహాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతానికి అయిదు మృతదేహాలు బయటపడగా పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి.చేరిన బోటు
శిధిలావస్థకు చేరిన బోటు
సత్యం బృందం మరియు విశాఖ నుండి డీప్ సీ డైవర్స్ నేరుగా ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి డైవర్లు బోటుకు లంగర్లు వేసి బయటకు తీశారు. అయితే గోదావరి నదిలో మునిగిన బోటు శిధిలావస్థకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ముక్కలుగా నీటీపై కనిపిస్తున్న బోటును బయటకు పూర్తిగా బటయకు తీసేందుకు సత్యం బృందం వెలికి తీస్తోంది. గత వారం రోజులుగా ధర్మాడి సత్యం బృందం లంగర్లు, ఐరన్ రోప్‌లతో తన ప్రయత్నాన్ని కోనసాగించింది. దీంతో రెండు రోజుల క్రితం బోటు రెయిలింగ్ బయట పడిన విషయం తెలిసిందే..అయితే 38 రోజులుగా బోటు నీటీలో ఉండడంతో పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్నట్టు కనిపిస్తోంది.