సోపోరి (జమ్మూకశ్మీర్) : ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ బాలికతోపాటు నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన జమ్మూకశ్మీర్‌లోని సోపోరి జిల్లా డంగర్ పుర ప్రాంతంలో వెలుగుచూసింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఉస్మాజాన్ అనే బాలిక గాయపడింది. గాయపడిన నలుగురిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.కరడుకట్టిన ఉగ్రవాదులు బాలికపై కాల్పులు జరిపిన ఘటనను తీవ్రంగా పరిగణించిన జమ్మూకశ్మీర్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.
