ఈ అడ్రస్‌కు వెళ్లాలంటే ఎటెళ్లాలి..? తమ్ముడూ ఆ దేశాధ్యక్షుడు ఎవరు.. ఏమైనా ఐడియా ఉందా..? ప్రపంచంలో అతిపెద్ద అభయారణ్యం ఎక్కడవుంది.. తెలిస్తే కాస్త చెప్పవూ..? ఇలాంటి వాటికి సమాధానం ఒకప్పుడు అడిగి తెలుసుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రపంచంలో ఏదైనా సరే, ఏ సమాచారం అయినా సరే తెలుసుకోవాలంటే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అందులో గూగుల్ డాట్ కామ్ టైప్ చేయడం, మనకు కావాల్సిన సమాచారం టైప్ చేస్తే చాలు ఇట్టే లభిస్తుంది. అంతలా సామాన్యుడితో పెనేసుకుపోయింది గూగుల్ తల్లి. ఈ రోజు గూగులమ్మకు 21 ఏళ్లు వచ్చాయి.గూగుల్
సామాన్యుడితో పెనువేసుకుపోయిన గూగుల్
గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజిన్. ఒకప్పుడు ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలంటే టీవీల్లోనో, లేదంటే మరుసటి రోజున వచ్చే పేపర్‌లోనో చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జమానా మారింది. గూగుల్ రాకతో అన్నీ అరచేతిలోని స్మార్ట్ ఫోన్‌లతోనే తెలిసిపోతున్నాయి. అవును గూగుల్ అంతలా దైనందిత జీవితంతో ముడిపడిపోయింది. గూగుల్ లేకపోతే జీవితమే లేదన్నట్లుగా అయిపోయింది. ఏ చిన్న సమాచారం కావాలన్న గూగుల్‌కు ఒక్క జై కొడితే చాలు క్షణాల్లో సమాచారం మీముందు ఉంటుంది.
