కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్‌పై ఇవాళే సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో సుప్రీంను ఆశ్రయించారు చిదంబరం. తనకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం, సీబీఐ కస్టడీ ఇవ్వడాన్ని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు చిదంబరం. మరి సుప్రీంకోర్టులో ఆయన ఊరట దక్కుతుందా? కస్టడీ ముగియనుండడంతో సీబీఐ మరోసారి ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
