మూడు రోజుల తర్వాత బంగారం ధర బుధవారం పెరిగినప్పటికీ గత నెలతో పోలిస్తే రూ. 2వేల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర కాస్త తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల ధర రూ. 39,800కు పడిపోయింది.
అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 150 తగ్గింది. దీంతో ధర 10 గ్రాముల ధర 36,470కి క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం తగ్గకపోగా.. రూ. 500 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 48,500కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇలాగే ఉన్నాయి.
