ఫిబ్రవరి 14 న జరిగిన పుల్వామా టెర్రరిస్టు దాడి లో మృతి చెందిన ప్రతి సిఆర్పిఎఫ్ సైనిక కుటుంబానికి రూ .5 లక్షలు ఇవ్వాలని మాతా అమృతానందమయి మఠ్ హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 14, 2019 న, జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని లెత్పోరా (అవన్తిపుర సమీపంలో) వద్ద జరిగిన సంచలనాత్మక ఫిదాయీన్ బాంబు దాడి, జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా సిబ్బందిని తీసుకువెళ్ళే వాహనాల పై దాడి చేశారు. ఈ దాడిలో 40+ సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సిబ్బంది మరియు దాడిచేసిన ఉగ్రవాది మరణించారు.
“దేశాన్ని కాపాడి వారి ధర్మాన్ని నిర్వర్తిస్తూ, చనిపోయిన ఈ ధైర్యవంతులైన సైనికుల కుటుంబాలకు మద్దత్తు ఇవ్వటం మా ధర్మం” అని శ్రీ మాతా అమృతానందమయి దేవి అన్నారు. ” బాధిత కుటుంబాలు మరియు వారి ప్రియమైన వారికి నా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాను . మనము వారిశాంతి మరియు శ్రేయస్సు కోసం ప్రార్థన చేద్దాం. ”
అమ్మా తమ 2019 భారత యాత్ర ఉత్తర దిక్కున ప్రయాణం లో మొదటి గమ్యం మైసూరుకు బయలుదేరుతుండగా, మాతా అమృతానందమయి మఠం, విరాళాన్ని ప్రకటించింది.
