హిందూసమాజ్ పార్టీ అధ్యక్షుడు కమలేష్ తివారీ హత్యకేసులో హంతకులను గుర్తించడం జరిగింది. లక్నోలోని తన నివాసంలో శుక్రవారం రోజున కమలేష్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హంతకులను గుర్తించినప్పటికీ వారిని అరెస్టు చేయకపోవడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజీలో ఇద్దరు ఆగంతకులు కమలేష్ నివాసంలోకి వెళుతున్నట్లుగా కనిపించింది . వారే ఈ హత్య చేసి ఉంటారనే అనుమానంను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిందితులు ఈ ఇద్దరే అయి ఉంటారని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.హిందుసమాజ్ పార్టీ అధ్యక్షుడు
డిమాండ్లు నెరవేర్చకుంటే ఆత్మాహుతికి పాల్పడతా
హిందూ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కమలేష్ హత్య తర్వాత పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టు మార్టంకు పంపారు. అనంతరం భౌతికకాయాన్ని అతని సొంత గ్రామం అయిన సీతాపూర్ జిల్లాలోని మహమూదాబాద్‌కు తరలించారు. ఆయన కుటుంబ సభ్యులకు భౌతికకాయాన్ని అప్పగించారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తమ కుటుంబాన్ని పరామర్శించి వారి డిమాండ్లను నెరవేర్చేవరకు తాము అంత్యక్రియలు నిర్వహించబోమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే తాను ఆత్మాహుతికి పాల్పడతానని మృతురాలి భార్య చెబుతోంది. అంతకుముందు కమలేష్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం శర్మ పరామర్శించారు.
