దివంగత.. భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం జాతి గర్వించదగ్గ వ్యక్తి అని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ కలాం జయంతి. ఆయన జయంతి సందర్భంగా ప్రధాని.. కలాం జ్ఞాపకాలను ట్విట్టర్ ద్వారా నెమరువేసుకున్నారు. రక్షణ రంగంలో కలాం చేసిన కృషి ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. రాష్ట్రపతిగా ఆయన దేశానికి చేసిన సేవలు ఆదర్శనీయం. ఎంత ఉన్నతమైన స్థానాలు అధిరోహించినప్పటికీ.. ఆయన సాధారణ జీవితం గడిపారనీ, వ్యక్తిగతంగా ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేరని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. పుస్తకాలే ఆయన ఆస్తి అని మోదీ అన్నారు. ఆయనను కలుసుకున్న క్షణాలు నా మనసులో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. భారత్ రక్షణరంగంలో బలపడడానికి ప్రధాన వ్యక్తి కలాం అని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.
