న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ నుంచి స్పైస్-2000 బాంబులు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాయి.దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైర్ పవర్ బలోపేతం అయ్యింది. బాలాకోట్‌లో దాడులు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వినియోగించింది ఈ స్పైస్ -2000 బాంబుెలు కావడం విశేషం. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యలో భాగంగా భారత్ బాలాకోట్ దాడులు నిర్వహించింది. ఆ సమయంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలపై భారత్ ఈ బాంబులను జారవిడిచింది.
ఈ ఏడాది జూన్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పెస్ బాంబుల కోసం ఇజ్రాయిల్‌తో రూ. 300 కోట్లకు ఒప్పందం చేసుకుంది. మొత్తం 100 బాంబులను సప్లై చేయాల్సిందిగా డీల్ కుదుర్చుకుంది. ఈ బాంబులు ఒక్కసారి పై నుంచి జారవిడిస్తే ఒక భవంతి లోపలికి చొచ్చుకుపోయి ఆ తర్వాత భూమిని తాకి విస్ఫోటనం చెందుతాయని అధికారులు వెల్లడించారు.
బాలాకోట్‌లో ఈ స్పైస్ -2000 వర్షన్ బాంబులను ప్రయోగించి సక్సెస్ కావడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దీనికి మించిన అడ్వాన్స్ బాంబులు మార్క్ 84 కోసం ఇజ్రాయిల్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఈ బాంబులు భవంతులను, బంకర్లను పూర్తిగా ధ్వంసం చేయగలే శక్తి ఉంటుంది. ఇక మార్క్ 84 వార్‌హెడ్లు మరో రెండు వారాల్లో భారత్‌కు చేరుకుంటాయని తెలుస్తోంది. ఇప్పటికే భారత్ పాక్ మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో ఈ తరహా బాంబులు భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. అంతేకాదు త్వరలో యాంటీ రేడియేషన్ క్షిపణలు కూడా భారత రక్షణ వ్యవస్థలో చేరనున్నాయి.
