బెహ్రెయిన్ : మొదటి అంతరాష్ట్రీయ బ్రాండ్ మరియు ఫ్రాంచైజ్ ఎక్స్పో 2019
క్విక్ మీడియా సొల్యూషన్స్ కంపెనీ డబ్ల్యు ఎల్ ఎల్ ద్వారా నిర్వహిస్తున్న “మొదటి అంతరాష్ట్రీయ బ్రాండ్ మరియు ఫ్రాంచైజ్ ఎక్స్పో 2019” – ఫిబ్రవరి 11 న, ఎక్స్పో యొక్క ప్యాట్రన్, ఎచ్. ఈ. షేఖ్ ఖాలెద్ బిన్ హుమూద్ అల్-ఖలీఫా , సి ఈ ఓ , బెహ్రెయిన్ టూరిజం& ఎక్సిబిషన్ అథారిటీ, బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎక్సిబిషన్ సెంటర్, సానబిస్, బెహ్రెయిన్ లో ప్రారంభించారు. ఇందులో భాగంగా,స్ట్రాటజిక్ భాగస్వాములు తంకీన్ మరియు సహయోజక భాగస్వాములు,యునిడో ఐ టీ పీ ఓ బెహ్రెయిన్ , మేన సెంటర్ అఫ్ ఇన్వెస్ట్మెంట్, సహయోజక పార్టనర్స్, బెహ్రెయిన్ బిజినెస్ విమెన్ సొసైటీ , మలేషియా వరల్డ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఇందులో భాగస్వాములుగా పాల్గొంటున్నారు.
ఈ ఎక్స్పో లో బెహ్రెయిన్ మరియు వివిధ దేశాల ఫ్రాంచైజ్ యొక్క ట్రేడ్ మరియు టెక్నాలజీ బ్రాండ్లను మరియు ఎఫ్ & బీ, రిటైల్, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ మరియు సర్వీస్ వంటి వివిధ రంగాలకు చెందిన ఇన్నోవేటివ్ బ్రాండ్ కాన్సెప్ట్లను ఫ్రాంచైజ్ ఎక్ప్యాన్షన్ మరియు బిజినెస్ నెట్వర్కింగ్ అవకాశాలను అభివృద్ధి చేయడానికి ప్రదర్శించారు.
ఈ ఎక్స్పో లో భాగంగా బెహ్రెయిన్ లోని కొత్త పరిశ్రమలకు సంబంధించిన విజయవంతమైన మహిళల విజయ గాథలను వర్క్ షాప్లను మరియు కాన్ఫరెన్సులో వెలుగులోకి తీసుకొచ్చారు.
ఈ రోజుల ఎక్స్పో లో ఎంట్రెప్రేంయూర్షిప్ డెవలప్మెంట్ బ్రాండ్ డెవలప్మెంట్ మరియు ఆర్ధిక స్థిరత్వం వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలమీద దృష్తి పెడతారు.
సిసెల్ పనయిల్ సోమన్
ముఖ్య కార్యనిర్వహణాధికారి, మిడల్ ఈస్ట్, ఇండ్ సమాచార్, బెెహరైన్.
