నటుడు చిరంజీవి సతీమణి సురేఖ యాదాద్రి లక్ష్మినర్సింహస్వామిని దర్శించుకున్నారు.. శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న ఆమే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైరా సినిమా విడుదల సంధర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్టు ఆమే తెలిపారు. ఆక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న నేపథ్యంలోనే విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు సురేఖ తెలిపారు.
ఈ సంధర్భంగా ఆమెకు ఆలయ పండితులు ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. రాజకీయాల నుండి బయటకు వచ్చిన తర్వాత నటుడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 చిత్రం ‘ సైరా’ కావడంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అతిపెద్ద బడ్జెట్‌తో స్వయంగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిర్మించిన సినిమా కావడం కూడ సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రీ రీలీజ్ ఫంక్షన్ అభిమానులతో కిటకిటలాడింది.
మరోవైపు స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన సినిమాను తీయాలనే ఆకాంక్ష గత పది సంవత్సరాలుగా ఉందని స్యయంగా చిరంజీవి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే… సెన్సార్ పూర్తి చేసుకుని గాంధి జయంతిన విడుదలకు సిద్దమైంది.
