తెలుగుదేశం అధినేత, మాజీ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు , ఆయన కుమారుడు నారా లోకేష్ లను గృహ నిర్బంధం చేసారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తెలుగుదేశం నేతల ఫై , కార్య కర్తల ఫై దాడులు జరుగుతున్నాయని దీనిని అరికట్టాలని బాబు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు
నర్సారావుపేట, సత్తనపల్లి, పల్నాడు, గుజరాలాలో 144వ సెక్షన్ విధించారు. ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సావంగ్ తెలిపారు.
ఛలో ఆత్మకూర్ ఆందోళన చేపడుతున్న టీడీపీ నేతలకు ఎటువంటి పర్మిషన్ లేదన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేదిలేదని టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ తన ట్విట్టర్‌లో తెలిపారు. మొన్నటివరకూ తన ఇంటిదగ్గర 144 సెక్షన్ అమలు చేశారు, నిన్నటి నుంచి పల్నాడులో.. ఈరోజు ప్రతి తెదేపా నాయకుని ఇంటిముందు అమలు చేస్తున్నారు. ఇది తుగ్లక్ పాలనకు పరాకాష్టకు అని లోకేశ్ తన ట్విట్టర్‌లో తెలిపారు.
