తెలుగు

నిబంధనలు పాటిద్దాం..కనులారా వీక్షిద్దాం!

హైదరాబాద్‌లో వైభవంగా జరిగే సామూహిక నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు ట్రాఫిక్ విభాగం తరపున పూర్తి చేశామని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. మంగళవారం ట్రాఫిక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ర్యాలీ ట్యాంక్‌బండ్ వరకు 18 కిలోమీటర్ల మేర కొనసాగుతుందన్నారు. ఈ రూట్‌లోకి నగరంలోని వివిధ ప్రాంతాలలో నుంచి వచ్చే 17 ప్రధాన ర్యాలీలు కలుస్తాయని వెల్లడించారు. లాలాపేట్ వద్ద ైప్లె ఓవర్ మరమ్మతుల కారణంగా మల్కాజిగిరి, తార్నాక వైపు నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ రూట్లలో రావాలని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులు, రాచకొండ పోలీసులు ఆయా మండపాల నిర్వాహకులకు వివరించారన్నారు. హైదరాబాద్‌లో జరిగే సామూహిక నిమజ్జనోత్సవానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారని వివరించారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర..పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చే వారు సొంత వాహనాలలో కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును, మెట్రో రైలును ఉపయోగించుకోవాలన్నారు. 7వ వరకు 20 వేల వరకు విగ్రహాలు నిమజ్జనమయ్యాయని, 9వ రోజు మరో 8 వేల నుంచి 10 వేల వరకు నిమజ్జనమవుతాయన్నారు. నిమజ్జనం రోజు గూగుల్‌లో లైవ్ ట్రాఫిక్ అపడేట్స్ ఉంటాయని, ట్రాఫిక్ రద్దీని సామాన్యులు గుగూల్ నుంచి తెలుసుకోవచ్చన్నారు, దాంతో పాటు ఎఫ్‌ఎం, ట్విట్టర్ ద్వారా ట్రాఫిక్ అప్‌డేట్స్ చేస్తామన్నారు.

2100 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని వివరించారు. ప్రధాన రూట్లలో బారీ కేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, నిమజ్జనోత్సవ ర్యాలీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు రద్దీ పెరుగుతుందని, అప్పటి నుంచి పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలులోకి వస్తాయని వెల్లడించారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్‌లోకి చిన్న విగ్రహాలను నిమజ్జనానికి తీసుకురావద్దని సూచించారు. నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్ వద్ద ఈ సారి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు.

బషీర్‌బాగ్ ైప్లె ఓవర్ కింద రెండు వైపుల రాకపోకలకు అనుమతి ఉంటుందని, ఇక్కడ ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఇదిలాఉండగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ ఇతర విభాగాలతో కలిసి 21 వేల మంది బందోబస్తుతో గురువారం జరిగే సామూహిక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావారణంలో పూర్తి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ సౌత్ ఆంక్షలు.. కేశవగిరి, మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్స్, ఇంజన్ బౌలి, నాగుల చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, అశ్ర హాస్పిటల్, మొగల్‌పురా, లక్కడ కోటె, మదీన ఎక్స్ రోడ్, ఎంజే.బ్రిడ్జి, దారు ఉల్ షిఫా ఎక్స్ రోడ్స్, సిటీ కాలేజీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.

హైదరాబాద్ ఈస్ట్ చంచల్‌గూడ జైల్ ఎక్స్ రోడ్స్, మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, సాలర్‌జంగ్ బ్రిడ్జి(శివాజీ బ్రిడ్జి), అఫ్జల్‌గంజ్, పుత్లీబౌలీ ఎక్స్ రోడ్, ట్రూప్ బజార్, జాంబాగ్ ఎక్స్ రోడ్స్, కోఠి ఆంద్రాబ్యాంకు. హైదరాబాద్ వెస్ట్ తోపె ఖానా మాస్క్, అలస్క హోటల్ జంక్షన్, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర అజంత గేట్, అబ్కారి లేన్, తాజ్ ఐలాండ్, భర్తన్ బజార్, కేఎల్‌కే బిల్డిండ్ వద్ద ఏఆర్ పెట్రోల్ పంప్. హైదరాబాద్ నార్త్(సికింద్రాబాద్) కర్బాల మైదాన్, బుద్ద భవన్ జంక్షన్, షెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట జంక్షన్ల వద్ద నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు ట్రాఫిక్‌కు అనుమతి లేదు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ ఎక్స్ రోడ్స్, ప్యాట్నీ ఎక్స్ రోడ్స్, బాట ఎక్స్ రోడ్స్, అడవయ్య ఎక్స్ రోడ్స్, గాన్స్ మండి ఎక్స్ రోడ్స్ వద్ద గురువారం ఉదయం 6 గంటల నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ఈ కూడళ్ల నుంచి ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.

హైదరాబాద్ సెంట్రల్ చాపల్‌రోడ్డు ఎంట్రీ, జీపీఓ దగ్గర గద్వాల్ సెంటర్, శాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రీ, స్కైలాన్ రోడ్ ఎంట్రీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జంక్షన్ దోమల్‌గూడ, కంట్రోల్ రూం దగ్గర కళాంజలి, లిబర్టీ జంక్షన్, ఎంసీహెచ్ అఫీస్ వై జంక్షన్, తెలుగు తల్లి ైఫ్లెఓవర్ వద్ద బీఆర్‌కే భవన్ జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంధ్ర భారతి, ద్వారకా హోటల్ జంక్షన్, ఖైరతాబాద్ జంక్షన్(విశ్వేశ్వరయ్య విగ్రహం), చిల్డ్రన్స్ పార్క్, మారియట్ హోటల్ జంక్షన్, కవాడిగూడ జంక్షన్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరా పార్కు జంక్షన్. అర్ధరాత్రి నగరంలోకి లారీలకు అనుమతి లేదు నిమజ్జనం సందర్భంగా 12/13వ తేదీ రాత్రి ఇతర రాష్ర్టాలు, ఇతర జిల్లాలకు చెందిన వాహనాలకు నగరంలోకి అనుమతి లేదు. గణేశ్ నిమజ్జనోత్సవం చివరి రోజు కావడంతో రాత్రి ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీంతో ఆయా వాహనాలను శివారు ప్రాంతాలలోని రూట్ల నుంచి తమ గమ్యస్థానాల వైపు వెళ్లాలి.

ఇతర రాష్ర్టాలు.. జిల్లాల నుంచి వచ్చే బస్సులు రాజీవ్ రహదారి, ఎన్‌హెచ్-7 వైపు నుంచి వచ్చే బస్సులు జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్ ఎక్స్ రోడ్స్, తార్నాక, జమై ఉస్మానియా ైప్లెఓవర్, నింబోలిఅడ్డా, చాదర్‌ఘాట్ మీదుగా ఎంజీబీఎస్(ఇమ్లీబన్)కు వెళ్లాలి. బెంగుళూర్ వైపు నుంచి వచ్చే వాహనాలను అరంఘర్ ఎక్స్‌రోడ్, చంద్రాయణగుట్ట ఎక్స్‌రోడ్, ఐఎస్‌సదన్, నల్గొండ ఎక్స్‌రోడ్, చాదర్‌ఘాట్ వైపు ఎంజీబీఎస్‌కు వెళ్లాలి. ముంబాయ్ రోడ్డులో వచ్చే వాహనాలను గోద్రెజ్ వై జంక్షన్, నర్సాపూర్ ఎక్స్ రోడ్స్, బోయిన్‌పల్లి, జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్, తార్నాక, జమై ఉస్మానియా ైప్లెఓవర్, అడిక్‌మెట్, నింబోలి అడ్డా మీదుగా వెళ్లాలి.

12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు సిటీలోకి అనుమతి లేదు. ప్రైవేట్ బస్సులు శివారు ప్రాంతాల నుంచే నడుపుకోవాలి. గురువారం ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు 10 గం. వరకు ఈ బస్సులకు నగరంలోకి అనుమతి లేదు.

ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు, అక్కడి నుంచి నగరంలోకి వచ్చే వారు ప్రధాన ర్యాలీ జరిగే రోడ్డుతో పాటు నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే దారులలో కాకుండా, ప్రత్యామ్నాయ దారులలో వెళ్లాలి. నిమజ్జనోత్సవ ప్రధాన ర్యాలీలు ఇవి నిమజ్జనోత్సవంలో ప్రధాన వినాయక శోభ యాత్ర ర్యాలీ కేశవగిరి నుంచి మొదలై అలియాబాద్, నాగులచింత, చార్మినార్, మదీన, అఫ్జల్‌గంజ్, ఎంజే. మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది. మార్గమధ్యలో పలు జంక్షన్ల నుంచి వచ్చి ఈ దారిలో ఎన్నో ర్యాలీలు కలుస్తాయి.

సికింద్రాబాద్ ఏరియా నుంచి ఆర్పీ రోడ్, ఎంజే రోడ్, కర్బాల మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నారాయణగూడ ఎక్స్‌రోడ్, హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా లిబర్టీ వద్ద ప్రధాన వినాయక శోభ యాత్ర ర్యాలీలో కలుస్తాయి. చిలకలగూడ ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చే గాంధీ దవాఖాన వైపు నుంచి వచ్చి ముషీరాబాద్ ఎక్స్ రోడ్డులో కలుస్తాయి. ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, ఓయూ ఎన్‌సీసీ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ దవాఖాన రూట్లలో వచ్చే ర్యాలీలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోపైన తెలిపిన ర్యాలీలో కలుస్తాయి. దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్‌సదన్, చంచల్‌గూడ, నల్గొండ క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లాలి, పెద్ద విగ్రహాలు కొన్ని మూసారాంబాగ్ నుంచి అంబర్‌పేట్ వైపు వెళ్లాలి.

టోలిచౌక్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ఓల్డ్‌సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్, ఎన్టీఆర్‌మార్గ్‌లోకి వెళ్లాలి. ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్ నుంచి వచ్చే వాహనాలు నిరంకారి భవన్ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌కు వెళ్లాలి. టప్పాఛబుత్ర, అసీఫ్‌నగర్, సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గ హోటల్, గోషామహల్ బరాద్రి, అలస్క వైపు నుంచి వచ్చి ఎంజే మార్కెట్‌లోని ప్రధాన ర్యాలీకి కలువాలి. పైన తెలిసిన రూట్లలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు విగ్రహాలతో తరలి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది, సాధారణ వాహనాలకు ఈ రూట్లలో అనుమతి ఉండదు. హెల్ప్ లైన్ నిమజ్జన ఉత్సావాలను చూసేందుకు వచ్చే ప్రజలకు పోలీసుల నుంచి ఏ సహాయం కావాలన్నా వెంటనే హెల్ఫ్‌లైన్ నంబర్లకు 040-27852482, 9490598985, 9010203626 ఫోన్ చేయవచ్చు.

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

520, Asmi Industrial Complex, Near Ram Mandir Railway Station, Goregaon West, 400104, Mumbai, Maharashtra.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us