చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో ఐదు ప్రాంతాల్లో జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) అధికారులు దాడులు చేశారు. యూఏఈలో మకాం వేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్కెచ్ వేశారని తెలిసింది. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారలు దాడులు చేశారు.
కోయంబత్తూరు జిల్లాలో దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ అధికారులు, తమిళనాడు పోలీసులు గురువారం వేకువ జామున ఐదు ప్రాంతాల్లో దాడులు చేశారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయని ఓ అధికారి తెలిపారు.
