రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు వాదనలు వింటున్నది. అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ ఈ కేసుపై ఇవాళ స్పందించారు. కేసును విచారించడం ఇవాళ 39వ రోజు అని, రేపు 40వ రోజు అని, కేసు విచారణకు రేపే చివరి రోజు అని చీఫ్ జస్టిస్ తెలిపారు. దసరా సెలవులతో సోమవారం ఈ కేసులో విచారణ సాగింది. సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ .. సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదించారు.
