ఈ నెల 22 నుంచి నవంబర్ 1 వరకు ఏడు ఖనిజపు గనులను వేలం వేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశాలో ఉన్న ఈ గనుల్లో 148.011 మిలియన్ టన్నుల రిజర్వులు ఉన్నట్లు అంచనా. వీటిలో నాలుగు లైమ్ స్టోన్, రెండు క్రోమైట్, ఒకటి గ్రాఫైట్ అని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రల్హద్ జోషి మాట్లాడుతూ..తొలుత వచ్చిన సంస్థలకే ఈ గనులను కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ గనుల వేలం పారదర్శకంగా జరుగనున్నదని, ఒడిశా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నట్లు మంత్రి చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ గనుల వేలం పారదర్శకంగా జరుగనున్నదని, ఒడిశా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నట్లు మంత్రి చెప్పారు.
