శాసనసభ శీతాకాల సమావేశాలు బెంగళూరు విధానసౌధలో కేవలం మూడు రోజులకే పరిమితం చేస్తూ మంత్రివర్గం నిర్ణయించిందని శాసనసభా వ్యవహారాల శాఖామంత్రి మాధుస్వామి వెల్లడించారు. తుమకూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సాధారణంగా శీతాకాల సమావేశాలు బెళగావిలోని సువర్ణసౌధలో నిర్వహించేవారు. కానీ ఇటీవల బెళగావి జిల్లా వ్యాప్తంగా భారీగా వరద రావడంతో జిల్లా అంతటా తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. అక్కడ సమావేశాలు జరిపేందుకు తగిన వాతావర ణం లేనందున బెంగళూరు విధానసౌధకే పరిమితంచేశామన్నారు.15 శాసనసభా స్థానాలకు ఉపఎన్నికలు జరిగేల కేంద్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేసిన మేరకు కేబినెట్లో మూడురోజులకే పరిమితం చేశామన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు చేయడం సాధ్యం కాదన్నారు.
ఉప ఎన్నికలు వాయిదాపడిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా కేబినెట్లో చర్చకు వచ్చి న సమయానికి కోడ్ అమలులో ఉండేదన్నారు. కోర్టుతీర్పుకు అనుగుణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయని అంతమాత్రాన కేబినెట్ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉండదన్నారు. అక్టోబర్ 10 నుంచి శాసనసభ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయన్నారు. కేవలం బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై మాత్ర మే చర్చ ఉంటుందన్నారు. సమావేశాల సం దర్భంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ మరిన్ని రోజులు కార్యకలాపాలు సాగించేలా నిర్ణ యిం తీసుకోవచ్చు అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత అంశమై సుప్రీం ధర్మాసనంలో విచారణలు సాగుతుండగా ఉప ఎన్నికల ప్రకటన సరికాదని అందుకే వాయిదా వేశారన్నారు.
