ఆర్టికల్ 370రద్దు సమయం నుంచి గృహనిర్బంధంలో ఉంచిన వివిధ కశ్మీర్ పార్టీల రాజకీయ నాయకులను గృహనిర్బంధం నుంచి వదిలేసినట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం తెలిపింది. దాదాపు రెండు నెలల తర్వాత వారిని గృహనిర్భంధం నుంచి విడుదల చేశారు. అయితే కొందరు చాలా ముఖ్యమైన నాయకులు…మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీ వంటి కొద్ది మందిని మాత్రం ఇంకా గృహనిర్భంధంలోనే ఉంచారు.
ప్రజా భద్రత చట్టం కింద ఫరూక్ నిసెప్టెంబర్-16,2019న హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజా భద్రత చట్టం ప్రకారం కఠిన నిబంధనలే ఉన్నాయి. ఈ చట్టం కింద ఇల్లే .. అనుబంధ జైలుగా పరిగణిస్తారు. అతను రెండేళ్ల వరకు కోర్టు విచారణ లేకుండానే ఇంటిలో నిర్బంధించి ఉంచబడతారు. అయితే బంధువులు, స్నేహితులను కూడా కలుసుకోవడానికి అనుమతించరు. అయితే ఒక ప్రధాన స్రవంతి రాజకీయ నాయకుడిపై, ముఖ్యంగా ఒక ఎంపీ, మాజీ ముఖ్యమంత్రిపై పిఎస్ఎ చట్టం ఉపయోగించడం ఇదే మొదటిసారి. సాధారణంగా, ఇది ఉగ్రవాదులను, వేర్పాటువాదులను లేదా రాళ్లు విసిరేవారిని అరెస్టు చేయడానికి ఉపయోగించబడింది.
ఆర్టికల్ 370రద్దు తర్వాత ఎటువంటి ఉద్రిక్త పరిస్థుతులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా పలువురు రాజకీయనాయకులను గృహనిర్బంధంలో ఉంచడాన్ని జమ్మూకశ్మీర్ యంత్రాంగం,బీజేపీ సమర్థించుకున్న విషయం తెలిసిందే.
కశ్మీర్ నాయకులను తాము జైళ్లల్లో బంధించలేదని,గెస్ట్ లు చూస్తున్నామని,విఐపీ బంగ్లాలలో వారిని ఉంచినట్లు ఇటీవల కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వ్యాఖ్యానించారు. తాము వారికి హాలీవుడ్ సినిమాల సీడీలను కూడా ఇచ్చామని,వారికి జిమ్ ఫెసిలిటీని కూడా కల్పించామని,వారు హౌస్ అరెస్ట్ లో లేరని,హౌస్ గెస్ట్ లుగా ఉన్నారని అన్నారు.
