హైదరాబాద్: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎల్‌సీఏ) యుద్ధ విమానం తేజస్‌ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. ఎల్‌సీఏ తేజస్‌ను త్వరలో నేవీలో ప్రవేశపెట్టనున్నారు. దీన్ని యుద్ధ నౌకపై వినియోగిస్తారు. దానికి ముందు ఇవాళ తేజస్‌కు అరెస్టెడ్ ల్యాండింగ్ పరీక్ష నిర్వహించారు. డీఆర్‌డీవో, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేశాయి. స్వల్ప దూరం నుంచే తేజస్‌ను ల్యాండ్ చేయడం ముఖ్యమైన అంశం. అయితే ప్రస్తుత పరీక్షలో తేజస్ ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు నిపుణులు చెప్పారు. గోవాలోని టెస్ట్ సెంటర్‌లో తేజస్‌ను పరీక్షించారు.
