చింతామణి, ఆంధ్రజ్యోతి: ద్విచక్రవాహనదారులకు గుబులుపుట్టించేలా కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయి. హెల్మెట్ ధరించకపోవడం, డిఎల్, ఇతర రికార్డులు లేక పోవడాన్ని గుర్తించిన పోలీసులు శుక్రవారం నిర్వహించిన కార్యాచరణలో ఏకంగా ఒక వ్యక్తికి రూ.16వేలు జరిమానా ను రూరల్ సీఐ శ్రీనివాసప్ప విధించారు.
