కేంద్రం నుంచి నిధుల సహకారం ఉంటుందని, పార్షియల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా NBFCలు లాభపడనున్నాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచడం ద్వారా ఎగుమతుల సమయాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె అన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతులు ఉండేలా ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని.. ఈ వ్యవహారాల్ని కేంద్ర మంత్రిత్వ కమిటీ పర్యవేక్షిస్తుందని ఆమె పేర్కొన్నారు. 2019 డిసెంబర్ నాటికి ఈ ప్రణాళిక అమల్లోకి వచ్చేలా చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు.
