న్యూఢిల్లీ :అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పేర్ సంచలన ప్రకటన చేశారు.అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ మరణించాడని మార్క్ ఎస్పేర్ తాజాగా ధ్రువీకరించారు. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పేర్ ఓ అమెరికన్ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. హంజాబిన్ లాడెన్ మృతి చెందాడనేది వాస్తవమేనని, దీనికి సంబంధించిన సమాచారం తన వద్ద లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో ఓ అమెరికన్ టీవీ చానల్ హంజాబిన్ లాడెన్ మృతి విషయాన్ని వెల్లడించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
