అహ్మదాబాద్: ఏదైనా ఓ ట్రెండ్ లోకి వస్తే.. దాన్ని అనుసరిస్తుంటారు కొందరు ప్రబుద్ధులు. ఇదివరకు సెల్ఫీల పిచ్చితో ప్రాణాల మీదికి తెచ్చుకునే వారు. ఇక దాని స్థానంలో టిక్ టాక్ మేనియా అలుముకొంది. టిక్ టాక్ వీడియోల కోసం సొంత ఆస్తులను సైతం ధ్వసం చేసుకోవడానికి వెనుకాడట్లేదనే వ్యవహారం తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ యాప్ మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే…మరికొందరు సొంత ఆస్తుల్ని సైతం మంటలపాలు చేస్తున్నారనడానికి ఈ ఉదంతం నిలువెత్తు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
