తెలుగు

బంగార్రాజు మ్యూజిక్ స్పీడందుకుంది

హీరోగా నాగార్జున పని అయిపోతుందనుకున్న సమయంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దడ దడ లాడించింది. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కాంబినేషన్ లో ఆ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. కాగా కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే బంగార్రాజు సినిమా స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయట. నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడు మరణం కారణంగా సినిమా పనులు కొన్నాళ్ళు వాయిదా పడ్డాయి. పైగా ప్రస్తుతం నాగ్, ‘బిగ్‌ బాస్‌-3’తో బిజీగా ఉన్నారు. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక నవంబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టి, వచ్చే ఏడాది వేసవిలో బంగార్రాజుని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

అయితే సాధారణంగా నాగార్జున తన సినిమాలకు పనిచేసిన దర్శకులకు పారితోషకం ఇస్తుంటారు. కానీ కళ్యాన్ కృష్ణకు మాత్రం ఈ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా..లాభాల్లో వాటా ఇస్తానని దర్శకుడికి మాట ఇచ్చారట. మరోవైపు ఈ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో నాగ చైతన్య లేదా అఖిల్ నటించే అవకాశాలున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నాగార్జున నిర్మించనున్న ఈ సినిమాని త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us