కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు డిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం విచారణ కోసం 14 రోజుల పాటు తమ కస్టడికి ఇవ్వాలని కోర్టును కోరారు. కాగా మంగళవారం సాయంత్రం మని లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే…శివకుమార్ అరెస్ట్ తర్వాత ఆయన నుండి పూర్తి వివరాలు సేకరించేందుకు ఈడీ మరిన్ని రోజుల కస్టడి కోరింది. అయితే ఇంకా శివ కుమార్ అరెస్ట్‌పై కోర్టు ఎలాంటీ తీర్పు వెలువరించలేదు.
కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేత సీనియర్ న్యాయవాది అయిన అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. నిందితుడు అధికారులు చెప్పినట్టు స్పందించకపోతే విచారణకు నిరాకరించినట్టేనా అని ఆయన ప్రశ్నించారు. ఇది వ్యక్తి స్వేఛ్చకు భంగం కల్గుతుందని అన్నారు. నాలుగు రోజుల క్రితమే శివకుమార్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారని, అయితే ఈడీ మాత్రం సహకరించడం లేదని చెబుతుందని అన్నారు. ఈడీ నిజాలు వెళ్లడించడం ఈడీ చెబుతుందని ..నిజం అంటే నిందుతుడు చేప్పేదా లేదా దర్యాప్తు సంస్థలు చెప్పేది నిజామా అని ప్రశ్నించారు.దర్యాప్తు కోరుకున్నట్టు చెప్పాలంటూ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సివస్తుందని కోర్టులో వాదించారు.
కర్టాటక ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కార్యాలయం అధికారులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుమారు 600 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను ఆయన అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజులుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులను ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇక ఆయన అరెస్ట్‌తో కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి. బంద్‌లో బాగంగా పలు స్కూళ్లు కార్యాలయాలు మూతపడ్డాయి.
