కొన్ని కమర్షియల్ బ్యాంకులను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆర్బీఐ ఖండించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ తప్పుడు వార్తలంటూ ఆర్బీఐ బుధవారం తన ట్వీట్‌లో పేర్కొంది. కొన్ని బ్యాంకులను మూసివేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదని కూడా ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను మూసివేయడం లేదన్నారు. కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందించేందుకు ప్రభుత్వమే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను బలోపేతం చేస్తుందని రాజీవ్ కుమార్ తెలిపారు.
