బెంగళూరు: మైసూరుపాక్ పేరు చెబితేనే చాలు ఇట్టే నోరూరుతుంది. ఈ తీపి మిఠాయికి సంబంధించిన సర్వహక్కులు తమవేనని పలు ఆధారాలతో సహా కర్ణాటక స్పష్టం చేసింది. దీనిపై తమిళనాడులో కొందరు అభ్యంతరాలు లేవనెత్తారు. మైసూరు పాక్ తమ సంప్రదాయ వంటకమని వాదన లేవనెత్తారు. రెండేళ్ళుగా ఈ వాదన సాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ తమిళ కాలమిస్టు ఆనంద రంగనాథన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చిచ్చు రేపాయి. తమిళనాడుకు చెందిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను భేటీ అయిన సందర్భంగా ఆనంద రంగనాథన్ ట్వీట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలోని ఎలక్ట్రానిక్ మీడియాలో భారీగా స్పందన కనిపించింది. మైసూరు పాక్ సాక్షిగా ఆనంద్ ఈ రెండు భాషల ప్రజల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారని మరికొందరు వి మర్శలు గుప్పించారు.
