న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు గురువారంనాడు వెల్లడించాయి. ఈ సమావేశంలో మోడీ వాతావరణ మార్పు, ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, చిన్న ద్వీపాలకు సహకారం వంటి పలు అంశాలపై మాట్లాడనున్నట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 27న రాత్రి 7:30 గంటలకు మోడీ ప్రసంగించనున్నారని ఐరాస విడుదల చేసిన ప్రాథమిక జాబితా ద్వారా తెలుస్తోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అదేరోజు అర్ధరాత్రి సమయంలో మాట్లాడే అవకాశం ఉంది. సమావేశం నుంచి కొందరు నాయకులు తప్పుకుంటే ఇమ్రాన్ ఖాన్‌కు నిర్ణీత సమయం కన్నా ముందే మాట్లాడే అవకాశం లభిస్తుంది.
