ధూలె : మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో ఉన్న ఓ రసాయనిక పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 15 మంది మృతి చెందగా.
20 మందికిపైగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సిలిండర్లు పేలడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాద సమయంలో పరిశ్రమలో వంద మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
