పూరీ: సూర్యుడ్ని దేవుడిగా పూజించడం అనాదిగా వస్తున్న విషయం. ఉదయాన్నే లేవగానే సూర్య నమాస్కారాలు చేయడం చూస్తుటాం. కానీ, సూర్యుడికి దేవాలయాలు తక్కువే. ఒడిషా సమీపంలోని పూరీలో కోణార్క్ సూర్యదేవాలయం ఉంది. ఈ దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. 13వ శతాబ్దంలో మొదటి నర్సింగ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర, విశేషాలు ఇక్కడ చూడొచ్చు.
