కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీకి సంబంధించిన తేదీ ఖరారు అయింది. ఈనెల 21న అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈనెల 14న అమిత్ షాను జగన్ కలవాల్సి ఉంది. కానీ మహారాష్ట్ర ఎన్నికల కారణంగా అమిత్ షా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో భేటీ వాయిదా పడింది.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వివరించడంతో పాటు, విభజన చట్టంలోని హామీల అమలుకు అమిత్ షాను జగన్ కోరనున్నారు. గత ప్రభుత్వం చేసిన భారీ తప్పిదాలను అమిత్ షా దృష్టికి జగన్ తీసుకెళ్లనున్నారు.
