బెంగళూరు: చంద్రుడిపై కూలిన విక్రమ్ ల్యాండర్ ఉనికిని ఇస్రో సైంటిస్టులు గుర్తించారు. ఈ విషయాన్ని ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో ఈరోజు పోస్టు చేసింది. చంద్రయాన్2కు చెందిన ఆర్బిటార్ ,విక్రమ్ పడిన ప్రాంతాన్ని సైంటిస్టులు గుర్తించారు. అయితే విక్రమ్ ల్యాండర్‌తో ఎటువంటి కమ్యూనికేషన్ కు ఆస్కారం లేకుండా పోయిందని సైంటిస్టులు తెలిపారు. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఏర్పరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వారు చెప్పారు. సెప్టెంబర్ 7న రాత్రి 1.51 సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగుతూ కుదుపులకు గురైందని, ల్యాండర్ వెలాసిటీ అదుపుతప్పడంతో అది స్టాఫ్ ల్యాండింగ్ కాలేదని వారు వెల్లడించారు. ఈ క్రమంలో ల్యాండర్ నుంచి సిగ్నల్స్ బ్రేకయ్యాయని వారు చెప్పారు.
