కొత్త సచివాలయాన్ని ఎలా అయినా నిర్మించేందుకు కేసీఆర్ సర్కారు భీష్మించుకున్నారని తెలుస్తుంది . ఈ విషయంపై తెలంగాణ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించడంతో నిజంగానే ఉక్కిరిబిక్కిరి అయ్యారనే చెప్పచు .అన్ని హంగులు ఉన్న సచివాలయం ఇప్పుడు అందుబాటులోనే ఉండగా మళ్ళి, వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కొత్త సచివాలయం నిర్మించడం అంత అవసరమా? అంటూ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టారు.
హైకోర్టు ధర్మాసనం అడిగిన వివిధ ప్రశ్నలతో ప్రభుత్వ తరఫు న్యాయవాది అసలు పొంతన లేని సమాధానాలు చెప్పి.. కేసీఆర్ సర్కారును తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి . విచారణ సందర్బంగా కొత్త సచివాలయం ఆవశ్యకతపై సర్కారీ ప్లీడర్ వినిపించిన వాదనలు,దానికి హైకోర్టుకు ఇచ్చిన సంజాయిషీలు అసలు పొంతనే లేదు అని విశ్లేషణలుపై కూడా మరింత ఆసక్తి రేపుతున్నాయి .
అయినా విచారణ సందర్భంగా కేసీఆర్ సర్కారుకు హైకోర్టు సంధించిన ప్రశ్నలు ఏ రేంజిలో ఉన్నాయి అన్న విషయానికి వస్తే… ఇప్పటికే అన్ని వసతులతో కూడిన సచివాలయం అందుబాటులో ఉండగా కొత్త సచివాలయం కట్టాల్సిన అవసరం ఎందుకు ? అని కోర్టు కేసీఆర్ సర్కారును నేరుగా ప్రశ్నించింది. అసలు ఇప్పుడున్న సచివాలయాన్ని ఎందుకు కూలుస్తున్నారో చెప్పాలంటూ హైకోర్టు సూటిగానే ప్రశ్నించింది. అంతేకాకుండా అగ్నిమాపక శాఖ ఇచ్చిన నివేదికను కూడా ప్రస్తావించిన హైకోర్టు.. ఇక ఏపీకి కేటాయించిన ఐదు బ్లాకులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఆ సచివాలయం అన్ని శాఖలకు సరిపోవడం లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది.
ఇలా హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించడంతో ప్రభుత్వ తరఫు న్యాయవాది సంబంధం లేని సమాధానాలు ఇచ్చి కేసీఆర్ సర్కారును బుక్ చేశారన్న వాదన స్పష్టంగా వినిపిస్తోంది. అయితే కొత్త సచివాలయంపై కేసీఆర్ సర్కారుకు వివిధ ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్టు,అలాగే అటు పిటిషనర్ కూ ప్రశ్నలు సంధించారు . ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు . తుది విచారణను మంగళవారం నాటికీ వాయిదా వేసింది. తొలి రోజు వాదనల్లోనే ప్రభుత్వానికి ముచ్చెమటలు పటాయి మరి రెండో రోజు విచారణలో తన వాదనను కేసీఆర్ సర్కారు ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాల్సిందే.
